రేపు సాయంత్రం ఐదు గంటలకు.. చప్పట్ల ధ్వని ప్రతిధ్వనించాలంతే: మహేశ్‌బాబు
- జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపు
- ప్రధాని పిలుపును అభిమానుల్లోకి తీసుకెళ్తున్న సెలబ్రిటీలు
- మనం కొట్టే చప్పట్లలో గౌరవం ఉట్టిపడాలన్న మహేశ్‌బాబు
రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దామని అన్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలని, మనం వారికిచ్చే గౌరవం వాటిలో కనిపించాలని అన్నాడు. ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేశ్‌బాబు పిలుపునిచ్చాడు.