భారత్ లో వేగం పుంజుకున్న కరోనా... నిన్న 167, ఇవాళ 223 కేసులు!
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక
- ఢిల్లీ, యూపీలోనూ పెరిగిన కేసుల సంఖ్య
- ఏపీలో 3, తెలంగాణలో 8 కేసుల నమోదు
కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర (49) అగ్రస్థానంలో ఉంది. కేరళలో 26, కర్ణాటకలో 15 మంది కరోనా బాధితులు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఏపీలో 3, తెలంగాణలో 8 కేసులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం భారత్ లో ఉన్న కరోనా బాధితుల్లో 32 మంది విదేశీయులు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నలుగురు కరోనాతో మరణించారు.