Narendra Modi: సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నా కరోనా వ్యాపిస్తోంది: మోదీ

PM Modi concerns corona spread in Saudi Arabia even there is heat wave
  • కరోనా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • రాష్ట్రాల్లో కరోనా తీవ్రతపై ఆరా
  • ఎండలకు కరోనా వ్యాపించదన్న అంశంపై ఆలోచించాలన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ సీఎంలను ఆయా ప్రాంతాల్లో కరోనా ఉద్ధృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోందని అన్నారు. అమెరికాలో మార్చి 1న 75 కేసులు నమోదు కాగా, ఇప్పుడా కేసుల సంఖ్య 14 వేలకు చేరిందని తెలిపారు. అయితే, ఎండ తీవ్రతకు కరోనా వ్యాపించదు అనే అంశంపై ఆలోచించాల్సి ఉందని, సౌదీ అరేబియాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కరోనా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా వైరస్ లు చల్లటి వాతావరణంలోనే మనుగడ సాగిస్తాయని, వేడికి తట్టుకోలేవని చెబుతుంటారు. అయితే కరోనా అధిక ఉష్ణోగ్రతల్లోనూ విస్తరిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Narendra Modi
Corona Virus
Saudi Arabia
Heat Wave
States

More Telugu News