'వి' హిట్ కొడితే సీక్వెల్ ఉన్నట్టే!
- పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు
- సీరియల్ కిల్లర్ గా నాని
- సీక్వెల్ ఉందనే హింట్ ఇస్తూ ముగింపు
నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నాని నటించడం .. క్లైమాక్స్ లో అనూహ్యమైన ట్విస్ట్ ఉందనే ప్రచారం జరగడంతో అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారనేది తాజా సమాచారం. సినిమా చివర్లో .. సీక్వెల్ వుంటుందనే హింట్ ఇస్తూనే ముగించారట. సీక్వెల్ ను దృష్టిలో పెట్టుకునే క్లైమాక్స్ ను డిజైన్ చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'వి' హిట్ టాక్ తెచ్చుకుంటే, సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమేనన్న మాట. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.