Virat Kohli: స్వీయ నిర్బంధంలో కోహ్లీ, అనుష్క!

Virat Kohli and Anushka Sharma under self quarantine
  • మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్న సెలెబ్రిటీ కపుల్
  • కరోనాను అడ్డుకోవడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపు
  • అందరూ స్వీయ నిర్బంధం విధించుకోవాలంటూ పిలుపు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి స్వీయ నిర్బంధం విధించుకున్నాడు. ఈ విషయాన్ని అనుష్క తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. దీనికి కోహ్లీ రీట్వీట్ చేశాడు.

 ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని... వైరస్ ను అడ్డుకోవడానికి ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని ఈ సెలెబ్రిటీ దంపతులు పిలుపునిచ్చారు. అందరి క్షేమం కోసం తామిద్దరం స్వీయ నిర్బంధం విధించుకున్నామని... ప్రజలంతా ఇదే మాదిరి స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరారు.

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ గురించి కూడా కోహ్లీ స్పందించాడు. ప్రధాని చెప్పనట్టు ప్రజలంతా ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లోనే ఉండాలని విన్నవించాడు.
Virat Kohli
Anushka Sharma
Self Quarantine
Team India
Bollywood

More Telugu News