KTR: కేటీఆర్‌ సర్‌, మా నాన్న చనిపోయాడు.. భారత్‌ కి వస్తున్నాను .. నన్ను క్వారంటైన్‌లో పెట్టకండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ విజ్ఞప్తి

dear KTR  sir Im coming to India tomorrow to perform my fathers last rights
  • 'మీ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా'నన్న కేటీఆర్ 
  • కుటుంబ సభ్యులను కలిసేలా  సాయం చేస్తామని హామీ
  • అయితే, సెల్ఫ్ క్వారంటైన్ లేక ఐసోలేషన్‌ ప్రక్రియను పాటించాలని సూచన 
కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశాల నుంచి వస్తోన్న వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ట్వీట్ చేస్తూ, తన తండ్రి చనిపోయాడని పేర్కొన్నాడు.

 'డియర్‌ కేటీఆర్‌ సర్‌.. నేను రేపు ఇండియాకు వస్తాను. మా నాన్న అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను.. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాను. నన్ను క్వారంటైన్‌లో పెట్టకుండా మీరు సాయం చేయగలరు' అని ట్విట్టర్‌లో కోరాడు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ, 'నేను మీకు, మీ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను. మీ కుటుంబ సభ్యులను కలిసేలా మేము సాయం చేస్తాం. అయితే, సెల్ఫ్ క్వారంటైన్ లేక ఐసోలేషన్‌ ప్రక్రియను పాటించండి. మీ వివరాలను కేటీఆర్‌ ఆఫీస్‌కు పంపండి' అని తెలిపారు.
KTR
Telangana
Twitter

More Telugu News