nelluru: విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో బ్రేక్‌!

  • వీరంతా విశాఖ నగర వాసులు
  • అబుదాబీ నుంచి చెన్నై విమానాశ్రయానికి రాక
  • అక్కడి నుంచి నెల్లూరు మీదుగా విశాఖ వెళ్లే ప్రయత్నం
విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులు నెల్లూరు మీదుగా విశాఖ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించిన అధికారులు వారిని అడ్డుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విశాఖకు చెందిన వీరంతా అబుదాబీ నుంచి విమానంలో చెన్నై చేరుకున్నారు.

అక్కడి నుంచి బస్సులో నెల్లూరు మీదుగా విశాఖ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారుల కంటపడ్డారు. దీంతో వీరిని అడ్డుకున్న అధికారులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి ఆరోగ్యంపై పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్య శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తేనే స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
nelluru
Visakhapatnam
six passengers
abudabhi

More Telugu News