Karimnagar District: నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న విదేశీయులు.. ఐసోలేషన్ వార్డుకు తరలింపు

  • అప్రమత్తమైన పోలీసులు
  • వారు పర్యటించిన ప్రాంతాల్లో జల్లెడపడుతున్న వైనం
  • విదేశీయులను అదుపులోకి తీసుకుని ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు
ఇండోనేషియా నుంచి తెలంగాణకు వచ్చిన పర్యాటకుల్లో ఎనిమిది మందికి కరోనా వైరస్‌ సోకిందన్న వార్తల నేపథ్యంలో వారు పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల వీరంతా కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. వీరిలో ఎనిమిది మందికి కరోనా వైరస్‌ సోకిందని తేలింది. దీంతో వీరు జిల్లాలోని ఏఏ ప్రాంతాల్లో పర్యటించారు, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్న సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.

మరోవైపు, నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న 14 మంది విదేశీయులను అదుపులోకి తీసుకుని, సికింద్రాబాద్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వీరి రక్త నమూనాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా విదేశీయులు పర్యటిస్తే ఆ సమాచారం అందించాలని అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.
Karimnagar District
Indonesia
tourists
Corona Virus

More Telugu News