Jagan: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏప్రిల్ 9కి వాయిదా

  • హైదరాబాద్‌ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ
  • హాజరైన విశ్రాంత అధికారులు మన్మోహన్‌సింగ్, రాజగోపాల్ 
  • మాజీ అధికారులను విచారించిన కోర్టు
jagan corruption cases trial

హైదరాబాద్‌ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఈ రోజు కొనసాగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత అధికారులు మన్మోహన్‌సింగ్, రాజగోపాల్ విచారణకు హాజరయ్యారు. వారిని విచారించిన అనంతరం ఈ కేసు వాయిదా పడింది. 

తదుపరి విచారణను ఏప్రిల్ 9న చేపడతామని సీబీఐ, ఈడీ కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొందరు నిందితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్యామ్‌ ప్రసాద్ ఇటీవల జరిగిన విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

More Telugu News