Vamsi paidipalli: మహేశ్ మూవీ వాయిదా పడటానికి అదే కారణం!

Vamsi paidipalli Movie
షార్ట్స్‌లో చూడండి
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తరువాత వంశీ పైడిపల్లి సినిమాను మహేశ్ బాబు చేయవలసి వుంది. అయితే సెకండాఫ్ పట్ల మహేశ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడనీ, మార్పులు చేయమని సూచించాడనే వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లి తగిన సమయంలో స్పందించకపోవడంతో, మహేశ్ బాబు ఆ ప్రాజెక్టును వాయిదా వేసేసి, పరశురామ్ సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు.

వంశీ పైడిపల్లి సకాలంలో స్పందించకపోవడానికి ఒక కారణం ఉందట. వంశీ పైడిపల్లి చేసిన 'మహర్షి' సినిమాకి ఆయన దగ్గర అసిస్టెంట్ గా సోలోమన్ పనిచేశాడట. స్క్రిప్ట్ పై ఆయనకి మంచి పట్టు వుంది. అందువలన వంశీ ఆయన హెల్ప్ కోరగా, అప్పటికే నాగార్జునతో 'వైల్డ్ డాగ్' ను రూపొందిస్తున్న సోలోమన్, వంశీ స్క్రిప్ట్ లో మార్పులు చేసేందుకు సమయాన్ని కేటాయించలేకపోయాడని అంటున్నారు. ఈ కారణంగానే వంశీ ప్రాజెక్టు వాయిదా పడిందని చెబుతున్నారు.
Go Back to Shorts
Vamsi paidipalli
Solomon
Mahesh Babu

More Telugu News