Hyderabad: 11న పంజాగుట్టలోని గలేరియా మాల్‌ను సందర్శించిన వారు జాగ్రత్త: హెచ్చరించిన ఆరోగ్య శాఖ

  • 11న గలేరియా మాల్‌ను సందర్శించిన కోవిడ్ బాధితుడు
  • అదే రోజు మాల్‌కు వెళ్లిన వారందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని హెచ్చరిక
  • అనుమానం ఉంటే 104 కు కాల్ చేయాలని సూచన
Health officials worry about who visited panjagutta galleria mall

ఈ నెల 11న హైదరాబాద్ పంజాగుట్టలోని గలేరియా మాల్‌ను సందర్శించిన వారు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ రోజున మాల్‌కు వెళ్లినవారు అందరూ స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉండాలని సూచించింది.

కరోనా పాజిటివ్ రోగి ఒకరు అదే రోజున మాల్‌లో కలియదిరిగాడని, కాబట్టి ఆ రోజున మాల్‌ను సందర్శించిన వారందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం చేసింది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నా, కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చినా వెంటనే 104 నంబరుకు కాల్ చేయాలని కోరింది. కాగా, గలేరియా మాల్‌ను సందర్శించిన కరోనా బాధితుడు ఎక్కడెక్కడ తిరిగి ఉంటాడన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

More Telugu News