Andhra Pradesh: నెల్లూరు బస్సులో ఒంగోలు బాధితుడు.. అప్రమత్తమైన అధికారులు

Ongole corona affected man travelled in Nellore bus
  • హైదరాబాద్‌లో 20 మందితో బయలుదేరిన బస్సు
  • వీరిలో ఆరుగురు నెల్లూరు వాసులు
  • జిల్లాలో 793 మంది హోం ఐసోలేషన్‌లో
ఒంగోలుకు చెందిన కరోనా బాధితుడు ఒకరు నెల్లూరు బస్సులో ప్రయాణించిన విషయం తెలిసిన జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు డిపోకు చెందిన హైదరాబాద్-చెన్నై బస్సులో ఈ నెల 16న అతడు ఒంగోలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఆ బస్సును సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.

 ఆ రోజు హైదరాబాద్ నుంచి 20 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. అయితే, నెల్లూరు చేరుకునేసరికి 16 మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఆరుగురు పట్టణానికి చెందినవారే కావడంతో వారిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. మిగతా వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేశారు. జిల్లాలో మొత్తం 793 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఐదుగురిని మాత్రం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
Andhra Pradesh
Nellore District
Ongole
Corona Virus

More Telugu News