KCR: ఈ నెల 22 వరకూ కాకుండా అంతర్జాతీయ విమానాలను తక్షణమే రద్దు చేయాలి: సీఎం కేసీఆర్​

CM KCR requests International flight services must be cancel immediately
  • ఈ విషయమై ప్రధాని మోదీని కోరతాను
  • విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను తీసుకురావాలి
  • అందుకు, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది
కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేయడం మంచిదని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సూచించారు. ‘కరోనా’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల 22 వరకూ వేచి చూడకుండా అంతర్జాతీయ విమాన సర్వీసులను వెంటనే రద్దు చేయాలని ప్రధాని మోదీని కోరతానని అన్నారు. మోదీతో రేపు జరిగే ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెస్తానని చెప్పారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా తీసుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
KCR
TRS
Telangana
Corona Virus
Narendra Modi
international flights

More Telugu News