Budda Venkanna: దిస్ ఈజ్ వాస్తవం జగన్ గారూ!: బుద్ధా వెంకన్న ట్వీట్

Buddha Venkanna warns YS Jagan over nomination filing incidents
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్ పై ధ్వజమెత్తిన బుద్ధా వెంకన్న
  • జగన్ దౌర్జన్యకాండ వాస్తవం అంటూ ట్వీట్
  • కేంద్ర బలగాలు రావడం కూడా వాస్తవమేనన్న వెంకన్న
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. తమను నామినేషన్లు వెయ్యనివ్వకుండా వైసీపీ వాళ్లు అడ్డుకున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికరంగా స్పందించారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ దౌర్జన్యకాండ వాస్తవం అని, కేంద్ర హోంశాఖకు ఎన్నికల సంఘం లేఖ రాయడం కూడా వాస్తవమేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కార్యాలయానికి కేంద్ర బలగాలు చేరుకోవడం వాస్తవం అని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎంతటి నియంత అయినా మట్టికరవడం వాస్తవం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తెలుగు, ఆంగ్లం కలగలిపి సీఎం జగన్ ను ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. "దిస్ ఈజ్ వాస్తవం జగన్ గారూ! మీరు మనిషిగా మారకపోతే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ నిరంతర ప్రక్రియ" అంటూ ట్వీట్ చేశారు.
Budda Venkanna
Jagan
Local Body Polls
Andhra Pradesh
SEC
Armed Forces

More Telugu News