Rachakonda: ‘కరోనా’ జాగ్రత్తలపై రాచకొండ ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రచారం

Rachakonda police interesting campaign on corona preventive actions
  • ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ’కరోనా‘పై సూచనలు
  • కొత్తపేట సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
  • ఓ వీడియోను పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రకటనల ద్వారా ప్రజలకు వివరిస్తోంది. ఈ విషయమై ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీస్ శాఖ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలను చైతన్యపరిచారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో ‘కరోనా’ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేశారు. కొత్తపేట సర్కిల్ పరిధిలో వాహనదారులకు ‘కరోనా’పై పోలీసులు పలు సూచనలు చేశారు.
Rachakonda
Traffic police
campaign
Corona Virus
preventive methods

More Telugu News