రమేశ్ కుమార్ పేరిట బయటకొచ్చిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలి: కళా

19-03-2020 Thu 14:38
  • గవర్నర్ ను కలిసిన అఖిలపక్షం
  • లేఖ ఎస్ఈసీ కార్యాలయం నుంచే వచ్చిందని భావిస్తున్నామన్న కళా
  • రమేశ్ కుమార్ కు భద్రత కల్పించాలని డిమాండ్
All Party representatives met governor

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై అఖిలపక్షం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయింది. భేటీ అనంతరం అఖిలపక్ష నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, తనకు ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పేరిట బయటకొచ్చిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ లేఖ ఎస్ఈసీ కార్యాలయం నుంచే వెళ్లినట్టు భావిస్తున్నామని తెలిపారు. లేఖ నేపథ్యంలో రమేశ్ కుమార్ కు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఏకగ్రీవాలతో సహా అన్నింటినీ రద్దు చేసి స్థానిక ఎన్నికలకు రీనోటిఫికేషన్ జారీ చేయాలని, మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలిసినవారిలో టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు ఉన్నారు.