PVP: చదువు సంధ్యలు లేని వాళ్ళు కూడా పార్లమెంటులో అడుగుపెడితే ఇంతే: పీవీపీ

YSRCP leader PVP gave a suggestion to Kesineni Nani
  • కేశినేని నాని, పీవీపీ మధ్య మాటల యుద్ధం
  • ఫేక్ న్యూస్ ప్రచారం ఆపాలంటూ ట్వీట్
  • బాధ్యతతో వ్యవహరించాలంటూ హితవు
విజయవాడ రాజకీయ బరిలో ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరూ ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇదే తరహాలో పీవీపీ ఓ ట్వీట్ చేశారు. చదువు సంధ్యలు లేని వెధవలు కూడా పార్లమెంటులో అడుగుపెడితే పరిణామాలు ఇంతేనంటూ వ్యాఖ్యానించారు. ఇదిగో పులి, అదిగో తోక అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం ఆపి, కాస్తంత బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిలా పనిచేయవయ్యా అంటూ కేశినేని నానీని ఉద్దేశించి పీవీపీ వ్యాఖ్యానించారు.
PVP
Kesineni Nani
Vijayawada
YSRCP
Telugudesam
Lok Sabha

More Telugu News