Narendra Modi: జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్రధాని మోదీ

PM Modi   to address nation today
షార్ట్స్‌లో చూడండి
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినపడుతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.  

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాల‌న్న అంశాల‌ను ఆయన చెబుతారని పీఎంవో ఇప్పటికే ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిపై నిన్న ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో పలువురు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, కరోనాపై మరిన్న చర్యలు తీసుకునే అంశంపై కీలక ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రాత్రి మోదీ ప్రసంగాన్ని ప్రజలందరూ తప్పకుండా వినాలంటూ బీజేపీ అగ్రనేతలు ట్వీట్లు చేస్తున్నారు. అన్ని చానెళ్లతో పాటు బీజేపీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News