దర్శకురాలిగా మారాలనే ఆలోచన వుంది: ధన్య బాలకృష్ణ
- చిన్నచిన్న పాత్రలతో గుర్తింపు
- హీరోయిన్ గా యూత్ లో క్రేజ్
- త్వరలోనే మెగా ఫోన్ పట్టాలనే నిర్ణయం
త్వరలో ఆమె 'అనుకున్నదొక్కటి .. అయినది ఒక్కటి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టాను. కానీ భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలనే ఆలోచన వుంది. లేడీ ఓరియెంటెడ్ కథతోనే నా తొలి సినిమా రూపొందుతుంది. దర్శకత్వం చేస్తూనే ఆ సినిమాలో నేనే ప్రధాన పాత్రధారిగా చేస్తాను. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ఇలా ఆ సినిమాలో అన్నిరకాల అంశాలు ఉంటాయి" అని చెప్పుకొచ్చింది.