Raviteja: రవితేజతో మరోసారి జోడీ కడుతున్న మాళవిక శర్మ

Ramesh Varma Movie
  • రవితేజతో 'బలుపు' చేసిన శ్రుతి హాసన్ 
  • 'బెంగాల్ టైగర్' తరువాత తమన్నాకి ఛాన్స్ 
  • మళ్లీ అవకాశం దక్కించుకున్న 'నేల టిక్కెట్టు' భామ
ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. ఈ మూడు సినిమాల్లోను ఆయన హీరోయిన్స్ ను రిపీట్ చేస్తుండటం విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. గతంలో ఆమె రవితేజతో కలిసి 'బలుపు' సినిమా చేసింది.

ఆ తరువాత సినిమాను ఆయన నక్కిన త్రినాథరావు దర్శత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో తమన్నా .. రవితేజ జోడీ కడుతోంది. గతంలో ఆమె 'బెంగాల్ టైగర్' సినిమాలో రవితేజతో కలిసి నటించింది. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేశారట. ఇంతకుముందు ఆమె 'నేల టిక్కెట్టు'లో రవితేజతో కలిసి అలరించింది. ఇలా రవితేజ వరుసగా హీరోయిన్స్ ను రిపీట్ చేస్తుండటం విశేషం. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ చేయనున్న సినిమాలో, కథానాయికగా ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
Raviteja
Sruthi Hassan
Thamannah
Malavika Sharma

More Telugu News