K Kavitha: నామినేషన్ వేసిన కల్వకుంట్ల కవిత

  • నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన కవిత
  • ఆమె వెంట ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • కవిత సునాయాసంగా గెలుస్తారన్న టీఆర్ఎస్ శ్రేణులు
K Kavitha files nomination for MLC election

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు కవిత తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కూడా బరిలోకి దిగినప్పటికీ... కవిత సునాయాసంగా గెలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో, ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. 2022 జనవరి 4 వరకు ఈ ఎమ్మెల్సీ స్థానానికి పదవీకాలం ఉంది.

More Telugu News