Harish Rao: కవితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు: హరీశ్ రావు

harish on kavitha nomination
  • నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో కవిత
  • ఈ రోజు నామినేషన్ దాఖలు
  • ఆల్‌ ది బెస్ట్ చెబుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు టీఆర్‌ఎస్‌ నేతలు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.

'నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్‌ వేసిన కవితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆయనతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
Harish Rao
K Kavitha
TRS

More Telugu News