అందరూ చావాల్సిందే.. కరోనా గురించి భయపడొద్దు: చెచెన్యా అధ్యక్షుడు

18-03-2020 Wed 12:26
  • రోగ నిరోధకశక్తిని పెంచుకోండి
  • నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగండి
  • భయంతో మీ సమయం రాకముందే చనిపోయే ప్రయత్నం చేయొద్దు
Dont panic over coronavirus you will die anyway says Chechen leader Ramzan Kadyrov

కరోనా వైరస్ కల్లోలం రేపుతున్న తరుణంలో చెెచెన్యా అధ్యక్షుడు రంజాన్ కడిరోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... అందరూ చనిపోవాల్సినవారేనని అన్నారు. సంప్రదాయ ఔషధాలను వాడాలని సూచించారు. పరిస్థితి చేజారిన సమయంలో కూడా ఆందోళనకు గురి కావద్దని చెప్పారు.

చైనాలో పుట్టిన వైరస్ తో ప్రజలు నిద్రపోవడం కూడా మర్చిపోయారని కడిరోవ్ అన్నారు. ఆ వైరస్ తమ వద్దకు కూడా వచ్చిందని ఇతర దేశాల ప్రజలు భీతిల్లుతున్నారని చెప్పారు. అందరూ చనిపోవాల్సిన వారేనని... భయాందోళనలతో మీ నిర్ణీత సమయం కంటే ముందే చనిపోయే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

ప్రజలంతా తమ ఆరోగ్యాలపై జాగ్రత్తలు తీసుకోవాలని... రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని కడిరోవ్ చెప్పారు. నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే వైరస్ సోకదని సూచించారు. వెల్లుల్లిని తీసుకోవాలని తెలిపారు.