Ramcharan: కరోనా విజృంభణ నేపథ్యంలో హీరో రామ్‌చరణ్ కీలక నిర్ణయం

ram charan cancels his birth day parties
  • నా బర్త్ డే వేడుక జరపొద్దు
  • ప్రస్తుతమున్న పరిస్థితులు తెలియనివి కావు
  • వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి
  • అదే నాకు ఇచ్చే బర్త్‌ డే గిఫ్ట్‌ 
కరోనా విజృంభణ నేపథ్యంలో హీరో రామ్‌చరణ్ కీలక నిర్ణయం తీసుకుని ప్రకటన చేశాడు. ఈ నెల 27న ఆయన పుట్టిన రోజు వేడుక ఉంది. అయితే, ఈ వేడుకను జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడు. తన మీద ఉన్న ప్రేమ కారణంగా తన జన్మదిన వేడుకను పండుగలా జరపడానికి ఫ్యాన్స్‌ పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలనని ఆయన తెలిపాడు.

ప్రస్తుతమున్న పరిస్థితులు ఫ్యాన్స్‌కి తెలియనివి కావని చెర్రీ చెప్పాడు. సాధ్యమైనంతవరకు జన సమూహం తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి తన పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్‌ జరుపుకోవద్దని కోరాడు.

అందరూ అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని రామ్‌చరణ్ పిలుపునిచ్చాడు. అదే తనకు ఇచ్చే బర్త్‌ డే గిఫ్ట్‌ అని తెలిపాడు. తన సూచనను అందరూ పాటిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
Ramcharan
Tollywood
Corona Virus

More Telugu News