KTR: వారిని రక్షించండి: కరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రులకు కేటీఆర్‌ ట్వీట్

Kindly request Union Govt to respond arrange for them to brought back home ktr
  • పలు దేశాల్లో విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
  • తనకు మెసేజ్‌లు వస్తున్నాయన్న కేటీఆర్‌
  • వారిని స్వదేశానికి తీసుకురావాలని వినతి 
కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌ పూరీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మనీలా, కౌలాలంపూర్‌, రోమ్‌లోని విమానాశ్రయాల్లో్ చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. వారి పరిస్థితుల గురించి వెంటనే స్పందించి, వారిని స్వదేశానికి తీసుకురావాలని తాను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.

కాగా,  తెలుగు విద్యార్థులు స్వదేశానికి రాలేక కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే, పలు ప్రాంతాల్లో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు దేశాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తుండడంతో భారతీయులు స్వదేశానికి బయల్దేరుతున్నారు.
KTR
Telangana
Twitter

More Telugu News