Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు...తెల్లవారు జామున ఖాతాలు ఖాళీ చేస్తున్న వైనం!

  • ఉదయం లేచాక మెసేజ్‌లు చూసి ఖాతాదారుల గగ్గోలు
  • ఓటీపీ అవసరం లేకుండానే డబ్బు అపహరణ
  • హైదరాబాద్‌లో ఓ వ్యక్తి నుంచి రూ. 95,200 మాయం
cyber crime in hyderabad

సైబర్‌ కేటుగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అందరూ మంచి నిద్రలో వుండే సమయంలో తమ పని మొదలెడుతున్నారు. తెల్లవారు జామున మూడు, నాలుగు గంటల సమయంలో ఈ సైబర్‌ నేరగాళ్లు తాము ఎంచుకున్న ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టడానికి ఉపక్రమిస్తున్నారు. ఉదయం లేచేసరికి వచ్చిన మెసేజ్‌లు చూసి ఖాతాదారులు లబోదిబోమన్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్, అమీర్‌పేటలోని గురుద్వారాకు చెందిన ఓ వ్యక్తి తన ఖాతా నుంచి 95,200 రూపాయలు మాయం అయ్యిందంటూ నిన్న సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ నేరగాళ్లు ఏకంగా ఇతని ఖాతా నుంచి గిప్ట్‌ కార్డులు కొనుగోలు చేయడం విశేషం.

తెల్లవారు జామున మూడు గంటల సమయంలో 38,000, 38,000, 18,200, 1,000కు నాలుగు లావాదేవీలు నిర్వహించారు. ఉదయం లేచిన సదరు వ్యక్తి ఈ లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు చూసి కంగుతిన్నాడు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకున్న తర్వాత సైబర్‌ క్రైం జరిగిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

More Telugu News