Digvijay Singh: దిగ్విజయ్ సింగ్ అరెస్ట్... పోలీస్ స్టేషన్ కు తరలింపు!

  • బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్
  • స్వాగతం పలికిన శివకుమార్
  • హోటల్ వద్ద ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
Digvijay Singh Arrested in Bengalore

మధ్యప్రదేశ్ లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోనే ఉంచాలన్న ఆకాంక్షతో, రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి, అమృతహల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నగరంలోని రమడా హోటల్ లో క్యాంప్ వేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన దిగ్విజయ్ ని హోటల్ సమీపంలో పోలీసులు అడ్డుకోగా, ఆయన రోడ్డుపైనే బైఠాయించారు.

అంతకుముందు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ స్వాగతం పలికారు. ఆపై వారిద్దరూ కలిసి హోటల్ వద్దకు వెళ్లగా, ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ, తాను ఎంపీనని, 26న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేస్తే, వారితో మాట్లాడాలని తాను వచ్చానని, కానీ పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారనే తాను భావిస్తున్నానని, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు.

More Telugu News