National Banks: 26, 27 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి...వరుస సెలవులు లేవు: ఉద్యోగ సంఘాలు

Banks will open on march 26  and 27 says union leaders
  • సామాజిక మాధ్యమాల్లో ఐదురోజులు మూతంటూ ప్రచారం
  • ఉగాది, వారాంతపు సెలవులు, సమ్మె అని వివరణ
  • అదేం లేదని స్పష్టం చేస్తున్న బ్యాంకు యూనియన్లు

జాతీయ బ్యాంకులన్నీ ఈ నెల 26, 27 తేదీల్లో యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఉగాది, వారాంతపు సెలవు దినాలతోపాటు ఉద్యోగుల సమ్మె కారణంగా ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు బ్యాంకులు మూతపడనున్నాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నెల 25వ తేదీన ఉగాది, 28వ తేదీ నాలుగో శనివారం, 29 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. దీనికి అదనంగా 26, 27 తేదీల్లో ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తేనే ఏటీఎంలు ఖాళీ అయ్యి అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని, అటువంటిది వరుసగా ఐదు రోజులు సెలవులంటే ఇబ్బందేనని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 26, 27 తేదీల్లో సమ్మె జరిగే అవకాశం లేదని, ఒకవేళ సమ్మె చేసినా బ్యాంకులు తెరిచే ఉంటాయని బ్యాంకు యూనియన్‌ నాయకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News