Tirumala: కరోనా భయంతో.. తిరుమలకు తగ్గిన భక్తుల రాక

  • క్యూ లైన్లలో రద్దీ లేకుండా అధికారుల చర్యలు
  • గంటకోసారి క్యూలైన్ల శానిటైజేషన్
  • పుష్కరిణిని మూసివేసే ఆలోచనలో అధికారులు
Low Rush in Tirumala

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తుల రాక కూడా మందగించింది. కేవలం టైమ్ స్లాట్ టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్న అధికారులు, క్యూలైన్లలో తోసుకునే రద్దీ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మంగళవారం నాడు 49,229 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక క్యూలైన్లను ప్రతి గంటకూ ఓసారి శానిటైజ్ చేస్తున్నామని, భక్తులు మాస్క్ లు ధరించి రావాలని సూచిస్తున్నామని అధికారులు తెలిపారు. తిరుమలలోని స్వామి పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేసే ఆలోచనలో ఉన్నామని, తుది నిర్ణయం తీసుకునే ముందు ఆగమ శాస్త్ర పండితులతో చర్చిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News