Hyderabad: కరోనా ఎఫెక్ట్: అమీర్‌పేటలో వందలాది కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల మూసివేతకు ఆదేశాలు

  • ఈ నెల 31 వరకు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశం
  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • హాస్టళ్లు మూసి విద్యార్థులను స్వస్థలాలకు పంపాలని ఉత్తర్వులు
GHMC orders to close Hostels and Coaching centers in Ameerpet

కరోనా వైరస్ భయంతో హైదరాబాద్, అమీర్‌పేటలోని కోచింగ్ సెంటర్లు మూతపడనున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే స్కూళ్లను మూసివేసిన ప్రభుత్వం ఇప్పుడు మైత్రీవనంలో వందలాదిగా ఉన్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

అమీర్‌పేటలో ఉన్న 850కిపైగా హాస్టళ్లు, ఐటీ కోచింగ్ సెంటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గీతా రాధిక ఆదేశిస్తూ ఆయా హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను వారి స్వగ్రామాలకు పంపాల్సిందిగా అధికారులు సూచించారు. ఉత్తర్వులను ఉల్లంఘించి శిక్షణ సంస్థలను తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News