Andhra Pradesh: టీడీపీకి మరో షాక్.. జగన్ సమక్షంలో నేడు వైసీపీలో చేరనున్న ఎమ్మెల్సీ శమంతకమణి, యామినీబాల!

TDP MLC Samanthakamani and YaminiBala ready to Join YSRCP
  • సింగనమల నియోజకవర్గంలో టీడీపీకి మరో ఝలక్
  • మూడు రాజధానుల బిల్లు ఓటింగుకి శమంతకమణి గైర్హాజరు 
  • అనుచరులతో కలిసి విజయవాడకు మహిళా నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగలింది. ఆ పార్టీని వీడిపోతున్న నేతల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల కూడా చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నేడు వీరిద్దరూ వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ బయలుదేరినట్టు సమాచారం.

నిజానికి వీరిద్దరూ పార్టీని వీడబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ సమయంలో శమంతకమణి శాసనమండలికి గైర్హాజరయ్యారు. ఆ క్షణం నుంచే ఆమె పార్టీని వీడబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవల యామినీబాలకు కూడా వైసీపీ నుంచి పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి నేడు జగన్ సమక్షంలో ఆ పార్టీ  కండువా కప్పుకోవాలని నిర్ణయించారు.
Andhra Pradesh
MLC Samanthakamani
Telugudesam
Yamini Bala
YSRCP

More Telugu News