'టక్ జగదీశ్' కోసం నాని డిఫరెంట్ లుక్!
- నాని తదుపరి సినిమాగా 'టక్ జగదీశ్'
- శివ నిర్వాణ కాంబినేషన్లో మరోసారి
- ఏప్రిల్ 2వ వారం నుంచి తదుపరి షెడ్యూల్
ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని ఫ్రెంచ్ కట్ తో .. డిఫరెంట్ లుక్ తో చాలా స్టైలీష్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. తదుపరి షెడ్యూల్ కోసం ఏప్రిల్ 2వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రీతూ వర్మ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో, నాజర్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.