Pradeep: వేషాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను: యాంకర్ ప్రదీప్

Attharintiki daredi brought identity to me
  • ఎంబీఏ చేయడం నాకు ఇష్టం లేదు
  • మా నాన్నగారిని ఏడాది సమయం అడిగాను  
  • తొలిసారిగా చేసిన సినిమా'మనోరమ' అని చెప్పిన ప్రదీప్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రదీప్ మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. "మా నాన్నగారు నాతో ఎంబీఏ చేయించడం కోసం 'లండన్' పంపించాలనుకున్నారు. నిజం చెప్పాలంటే నాకు ఎంబీఏ చేయాలని లేదు. అక్కడ బ్యాచిలర్ కష్టాలు ఎలా వుంటాయో మా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలుసు. అందువలన అక్కడికి వెళ్లే ఆలోచనలేదు.

'నాకు నచ్చిన కెరియర్ ను ఎంచుకుంటాను .. ఒక ఏడాది సమయం ఇవ్వండి' అని మా నాన్నగారిని అడిగాను. ఆయన 'సరే' అనడంతో వెంటనే రంగంలోకి దిగిపోయాను. మంచి మంచి ఫొటోలు దిగేసి, వాటిని పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. తొలిసారిగా నేను 'మనోరమ' సినిమా కోసం కెమెరా ముందుకు వెళ్లాను. చిన్న పాత్రే అయినా, 'అత్తారింటికి దారేది' నాకు మంచి పేరు తీసుకొచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
Pradeep
Manorama Movie
Attharintiki Daredi Movie

More Telugu News