Sunny Leone: చాలా బాధాకరం.. మా పిల్లలు ఇలా జీవించాల్సి వస్తోంది!: సన్నీ లియోన్‌

Sunny Leone Training Toddlers To Wear Masks Amid Coronavirus Outbreak
  • తన భర్త, పిల్లల ఫొటోలు పోస్ట్ చేసిన సన్నీ
  • మాస్కులు ధరించిన ఆమె కుటుంబం
  • ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరన్న సన్నీ

కరోనా వైరస్‌ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ తన ముగ్గురు పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. మాస్కులు ధరించి తాను, తన భర్త డ్యానియెల్, దత్తత పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

'ఇదో కొత్త శకం! మా పిల్లలు ఇప్పుడు ఇలా జీవించాల్సి వస్తుండడం చాలా బాధాకరం.. కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మాస్కులు ఎలా ధరించాలన్న విషయంపై పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను' అని ఆమె తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఇప్పటికే పలుసార్లు తెలిపింది. తన భర్తతో కలిసి ముఖానికి మాస్కులు ధరించిన ఫొటోలను షేర్ చేసింది.    

  • Loading...

More Telugu News