Northeast states: చైనీయుల పోలికలు.. 'కరోనా' నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు!

North East State students urges people not to call us Corona
  • చూడ్డానికి చైనీయుల్లా ఉండే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు
  • కరోనా.. కరోనా అని పిలుస్తున్నారంటూ ఆవేదన
  • చివరికి స్నేహితులు కూడా దూరం పెడుతున్నారంటూ వీడియో
చైనాను ఆనుకుని ఉండడం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారింది. వారు అచ్చం చైనీయులను పోలి ఉండడమే అందుకు కారణం. చైనీయుల్లా ఉన్న వారు ఎక్కడ కనిపించినా ఇతరులు దూరం పెడుతున్నారట. అంతేకాదు, చైనీయులు అనుకుని ‘కరోనా’ అంటూ పిలుస్తున్నారట. పంజాబ్‌లో ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు కొందరికి ఈ అనుభవం ఎదురైంది. దీంతో వాపోయిన వారందరూ ఓ వీడియోలో తమ ఆవేదనను పంచుకున్నారు.

చైనీయుల్లా ఉన్నామంటూ తమకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు జంకుతున్నారని, చివరికి స్నేహితులు కూడా తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరైతే తమను ‘కరోనా.. కరోనా’ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. తాము చైనా వాళ్లం కాదని, తమపై ఈ వివక్ష వద్దని వేడుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక స్వరూపం గురించి తెలియకపోతే ఓసారి భారతదేశ పటం చూడాలని కోరారు. తాము స్వచ్ఛమైన భారతీయులమని, తమను అలా పిలవొద్దని వేడుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Northeast states
Corona Virus
China
Viral Videos

More Telugu News