Turkey: మానవ అక్రమ రవాణా కేసు.. టర్కిష్ కోర్టు సంచలన తీర్పు

Three men sentence 125 years each over boy Alan Kurdi traffickers case
  • అప్పట్లో గుండెలు పిండేసిన చిన్నారి కుర్దీ మరణం
  • 8 మంది సామర్థ్యం కలిగిన బోటులో 16 మంది తరలింపు
  • ఘటన జరిగిన నాలుగున్నరేళ్లకు శిక్ష
మానవ అక్రమ రవాణా చేస్తూ పలువురి మరణానికి కారణమైన ముగ్గురికి 125 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ టర్కిష్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఘటన జరిగిన నాలుగున్నరేళ్లకు తీర్పు వెలువడడం గమనార్హం. 2 సెప్టెంబరు 2015లో సముద్ర తీరంలో అచేతనంగా పడివున్న మూడున్నరేళ్ల చిన్నారి అలెన్ కుర్దీ చిత్రం అప్పట్లో ప్రపంచం గుండెలను పిండేసింది. ఈ ఫొటో బయటకు వచ్చిన తర్వాతే శరణార్థుల అంశంపై ప్రపంచ దేశాలు స్పందించాయి. వారి విషయంలో పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

కుర్దీ కుటుంబం సహా మరికొందరిని టర్కీ నుంచి గ్రీకుకు తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో కుర్దీ కుటుంబం సహా పలువురు మృతి చెందారు. 8 మంది సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ బోటులో ఏకంగా 16 మందిని ఎక్కించి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణం మొదలైన కాసేపటికే బోటు సముద్రంలో మునిగిపోయింది. కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకు దోషులు 6 వేల డాలర్లు వసూలు చేశారు. కాగా, ఈ కేసులో దోషులైన మరికొందరికి కూడా కోర్టు జైలు శిక్ష విధించింది.
Turkey
Alan Kurdi
125 Years Sentence

More Telugu News