Budda Venkanna: మాచర్ల ఘటన నేపథ్యంలో బుద్ధా వెంకన్నకు పోలీసుల నోటీస్​

TDP MLC Budda Venkanna has received police Notice
  • రేపు గురజాల డీఎస్పీ ఆఫీసుకు రావాలన్న పోలీసులు
  • బుద్ధా తన వద్ద ఆధారాలతో సహా రావాలని సూచన
  • మాచర్లలో బుద్ధా, బోండాలపై ఇటీవల జరిగిన దాడి
మాచర్ల ఘటన నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు పోలీసుల నుంచి నోటీస్ అందింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం రేపు గురజాల డీఎస్పీ ఆఫీసుకు రావాలని సూచించారు. తన వద్ద వున్న ఆధారాలతో రావాలని వెంకన్నకు అందిన నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమ, వారి అడ్వకేట్స్ ఇటీవల మాచర్ల వెళ్లిన విషయం తెలిసిందే. వీరి వాహనాలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి.
Budda Venkanna
Telugudesam
Gurazala
Macherla incident

More Telugu News