Gade Venkatreddy: వైసీపీలో చేరిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి

Tdp leader Gade Venkatreddy joined YSRCP
  • టీడీపీ నాయకుడు, ఉమ్మడి ఏపీలో మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి
  • వెంకట్ రెడ్డితో పాటు ఆయన తనయుడూ వైసీపీలో చేరిక
  • ఇద్దరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
టీడీపీ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వెంకట్ రెడ్డితో పాటు ఆయన తనయుడు కూడా వైసీపీలో చేరారు. తండ్రీ కొడుకులకు వైసీపీ కండువాలు కప్పిన జగన్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో పలుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి వెంకట్ రెడ్డి గెలిచారు. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా గాదె పని చేశారు. ఆ తర్వాత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉన్న సమయంలో కూడా వారి మంత్రివర్గంలో ఉన్నారు. 2016లో టీడీపీలో ఆయన చేరారు.
Gade Venkatreddy
Telangana
Jagan
YSRCP

More Telugu News