Ballet papers: చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న బ్యాలెట్​ పత్రాల ముద్రణ!

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా  
  • అయినప్పటికీ చిత్తూరులో బ్యాలెట్ పత్రాల ముద్రణ  
  • జిల్లా సహకార సంఘం, పలు ప్రైవేట్ కేంద్రాల్లో ముద్రణ
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే,  ఎన్నికల ప్రక్రియ నిలిచినా చిత్తూరు జిల్లాలో మాత్రం బ్యాలెట్ పత్రాల ముద్రణ కొనసాగుతోంది. జిల్లా సహకార సంఘం, పలు ప్రైవేట్ కేంద్రాల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద నామమాత్రపు భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికలు వాయిదాపడినా బ్యాలెట్ పత్రాలు ముద్రించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Ballet papers
printing
Chittoor District
Local Body Polls
postponed

More Telugu News