Eatala Rajender: కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కేసులు తప్పవు: ఈటల హెచ్చరిక

  • తెలంగాణలో కరోనా కట్టడికి కఠిన చర్యలు
  • కరోనాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి ఈటల వెల్లడి
  • అసత్య ప్రచారం చేయొద్దంటూ విజ్ఞప్తి
Eatala warns on fake news against corona virus

తెలంగాణలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ బంద్ అయ్యాయి. అయితే, తెలంగాణలో కరోనాపై దుష్ప్రచారం జరుగుతోందని, ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ అంటూ ఎవరైనా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దయచేసి ఎవరూ తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయవద్దని స్పష్టం చేశారు.

More Telugu News