Pavan Kalyan: 'వకీల్ సాబ్' కోసం రంగంలోకి లావణ్య త్రిపాఠి

  • షూటింగు దశలో 'వకీల్ సాబ్'
  • హిందీ .. తమిళభాషల్లో ఆదరణ పొందిన కథ 
  • త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు
Vakeel Saab Movie

పవన్ కల్యాణ్ 'పింక్' రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 'వకీల్ సాబ్' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది.'దిల్' రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో నివేద థామస్ .. అనన్య .. అంజలి నటిస్తున్నారు.

తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారని సమాచారం. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా ఇలియానాను .. శ్రుతి హాసన్ ను సంప్రదించారు. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియదుగానీ, లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారు. పవన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో ఆదరణ పొందిన ఈ కథ, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

More Telugu News