Tamil Nadu: వారిద్దరి మధ్య అనైతిక వ్యవహారం... చూసిన పాపానికి అతన్ని చంపేశారు!

Man murdered due to illegal affair
షార్ట్స్‌లో చూడండి

తన బంధువైన మహిళ వేరొక యువకుడితో కలిసి ఉండడాన్ని అతను చూశాడు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు మహిళ.. ఈ సంగతిని అతను తన భర్తకు ఎక్కడ చెబుతాడోనని భయపడింది. దీంతో ప్రియుడితో కలిసి బంధువును హత్యచేసింది. అనంతరం పారిపోతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 

పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రం మధురై తిరుమాల్ తాలూకా చెన్నైమెట్టు తూర్పువీధికి చెందిన సుబ్బయ్య, లక్ష్మి (32) దంపతులు. లక్ష్మి బంధువు పేతురాజ్ వాళ్లింట్లోనే ఉంటున్నాడు.

లక్ష్మికి శివగంగై జిల్లా ఇడయ మేలూరుకు చెందిన పాండితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నెల పదో తేదీన లక్ష్మి, పాండి ఇంట్లో కలిసి ఉండగా పేతురాజ్ చూశాడు. పేతురాజ్ చూడడాన్ని గమనించిన లక్ష్మి ఆందోళన చెందింది. భర్తకు చెప్పేస్తాడేమోనని భయపడింది. ప్రియుడితో కలిసి పేతురాజును చంపేసింది. అనంతరం లక్ష్మి, పాండిలో రైలులో పారిపోయారు.

పేతురాజ్ హత్యపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మి, పాండిల ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు పంపించారు. దీంతో తిరువత్తూరు జిల్లా జోలార్ పేట రైల్వే సీఐ వడివు కరసి స్టేషన్లో నిఘావేసి ఉండగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న మైసూర్ ఎక్స్ ప్రెస్ లో నిందితులు ప్రయాణిస్తున్నారన్న సమాచారం అందింది. 

దీంతో రైలును జోలార్ పేటలో నిలిపి తనిఖీలు చేయగా నిందితులు ఇద్దరూ చిక్కారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు.

Go Back to Shorts
Tamil Nadu
madhurai district
man murderd
illigal affair

More Telugu News