RGV: శివ సినిమాలో నాగ్ వెనుక పూరీ జగన్నాథ్ ఎలా ఉన్నాడో చూశారా..?: వర్మ

RGV shares an interesting photo from Siva movie
  • తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన శివ
  • నాగ్, వర్మలకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టిన చిత్రం
  • తాజాగా శివ సినిమా స్టిల్ పంచుకున్న వర్మ
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట రిలీజై తెలుగు సినిమా ఒరవడిని కొత్త పుంతలు తొక్కించిన చిత్రం శివ. కథాపరంగా, సాంకేతిక విలువల పరంగా శివ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమాలో నటించిన నాగార్జున ఇమేజ్ అమాంతం పెరిగిపోగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.

అయితే, వర్మ తాజాగా శివ చిత్రానికి సంబంధించి ఓ స్టిల్ ను ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఆ ఫొటోలో హీరో నాగార్జున వెనుక పూరీ జగన్నాథ్ నిలబడి ఉండడం చూడొచ్చు. శివ షూటింగ్ లో నాగార్జున, ఇస్మార్ట్ పూరీ జగన్ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తన తనయుడు ఆకాశ్ ఎలా ఉన్నాడో నాడు పూరీ అలాగున్నాడు. కాగా, వర్మ ట్వీట్ పై స్పందించిన పూరీ జగన్నాథ్... "మీ దయ వల్లే" అంటూ వినమ్రంగా ట్వీట్ చేశాడు.
RGV
Siva
Nagarjuna
Puri Jagannadh
Tollywood

More Telugu News