Buddha Venkanna: ఆ పని చేస్తే శేషన్ లా చరిత్రలో నిలిచిపోతారు... లేకపోతే శ్రీలక్ష్మిలా మిగిలిపోతారు: బుద్ధా

  • ఎన్నికల కమిషనర్ కు బుద్ధా సూచన
  • జగన్ సర్కారుపై కేంద్రానికి లేఖ రాయాలన్న బుద్ధా
  • పిన్నెల్లిని ఏ1 ముద్దాయిగా చేర్చాలంటూ డిమాండ్
Buddha Venkanna suggests AP SEC Ramesh Kumar to write a letter to Centre

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తే మహానుభావుడు టీఎన్ శేషన్ లా చరిత్రలో నిలిచిపోతారని, లేకపోతే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిలా మిగిలిపోతారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"ఎన్నికలు సజావుగా సాగేందుకు మీరు జగన్ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలి. తద్వారా ఎన్నికలను సక్రమ మార్గంలో నడిపించాలి. టీఎన్ శేషన్ గారు గతంలో తన నిర్ణయాలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మీరూ అలాగే చేయండి. లేకపోతే, ఇక్కడ జరుగుతున్న ఘటనలను చూసీ చూడనట్టు వదిలేస్తారా... శ్రీలక్ష్మిలా జైలుకెళతారు. మాచర్ల ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1 ముద్దాయిగా చేర్చాలి. అతడే కుట్రదారుడు. మాపై ఐదు చోట్ల హత్యాయత్నం చేయించాడు. మాచర్లలో మాకు తగిలిన దెబ్బలు ఇప్పటికీ తగ్గలేదు... కానీ నిందితుల అరెస్టులు ఇంతవరకు చూపించలేదు. అక్కడ జరిగిన ఏకగ్రీవాల్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలి" అంటూ డిమాండ్ చేశారు.

More Telugu News