Pawan Kalyan: ఎన్నికలను ఎలాగో వాయిదా చేశారు.. ఈ పని కూడా చేయండి: పవన్ కల్యాణ్

  • నామినేషన్ల ప్రక్రియ మరోసారి నిర్వహించాలి
  • నామినేషన్ల సమయంలో పలు చోట్ల దాడులు చేశారు
  • ప్రభుత్వానికి కొమ్ము కాసేలా ఎన్నికల సంఘం వైఖరి ఉంది
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోము 
pawan kalyan about local body elections

'స్థానిక ఎన్నికలను ఎలాగో వాయిదా వేశారు కాబట్టి.. నామినేషన్ల ప్రక్రియ కూడా మళ్లీ జరపాలి' అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నామినేషన్ల సమయంలో పలు చోట్ల దాడులు చేశారు. ప్రభుత్వానికి కొమ్ము కాసేలా ఎన్నికల సంఘం వైఖరి ఉంది' అని విమర్శించారు.

'నామినేషన్ల ప్రక్రియ మరోసారి నిర్వహించాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోము.
మళ్లీ నామినేషన్ల ప్రక్రియ మొదలు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి. లేదంటే న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తుంది. దౌర్జన్యాలతో మమ్మల్ని ఆపలేరు' అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.  కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

More Telugu News