ఉపాధ్యాయురాలిని రెండో పెళ్లి చేసుకున్న ప్రిన్సిపాల్.. పాఠశాలపై దాడిచేసిన కుటుంబ సభ్యులు!
- హైదరాబాద్‌లోని కార్మిక నగర్‌లో ఘటన
- తన వయసులో సగం ఉన్న టీచర్‌ను రెండో పెళ్లి చేసుకున్న వైనం
- అరెస్ట్ చేసిన పోలీసులు
అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి(23)తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న అయూబ్ అలీ తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి పది రోజుల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలపై శనివారం దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఫర్నిచర్, కంప్యూటర్, పూలకుండీలు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయూబ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.