Yoga: యోగాతో కరోనాను దూరంగా ఉంచొచ్చు: యోగా గురు బాబా రాందేవ్

Baba Ramdev says Corona Virus away with Yoga
  • ఎవరికి వారే రక్షణ చర్యలు తీసుకోవాలి
  • ప్రయాణాల్లో శానిటైజర్లు దగ్గర పెట్టుకోవాలి
  • యోగా సాధన ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి
యోగా ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, తద్వారా కరోనాకు దూరంగా ఉండాలని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

నిన్న మీడియాతో మాట్లాడిన బాబా రాందేవ్.. ప్రజలకు పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రయాణాల్లో శానిటైజర్లు వాడాలని సూచించారు. ఇతరుల నుంచి నాలుగైదు అడుగుల దూరంలో ఉండాలని, మాస్కులు ధరించాలని అన్నారు. ప్రతి రోజూ యోగా సాధన చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని కోరారు. అయితే, ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి వారు సహజ జీవనశైలిని అనుసరించాలని కోరుతున్నట్టు చెప్పారు.
Yoga
Baba Ramdev
Corona Virus

More Telugu News