పెళ్లికి వెళ్లి వస్తుండగా దారుణం.. ఆటో బోల్తాపడి నలుగురు దుర్మరణం
- శ్రీకాకుళం జిల్లాలో ఘటన
- ఘటనా స్థలంలోనే మృతి చెందిన ముగ్గురు
- బాధితులు కొత్తకోట వాసులుగా గుర్తింపు
నరసన్నపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తుండగా బైరికూడలి వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులైన వెంకటి, సింహాచలంతోపాటు శ్రీలత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.