Andhra Pradesh: వారాంతాల్లో విజయవాడ విడిచి వెళుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం ఆగ్రహం

AP government furious over IAS and IPS officers leaving state on weekends
  • హైదరాబాద్, ఢిల్లీలో నివాసం ఉండడం పట్ల అసంతృప్తి
  • మెమో జారీ చేసిన సీఎస్ నీలం సాహ్నీ
  • ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని ఆదేశాలు
రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారాంతాల్లో అందుబాటులో లేకుండా విజయవాడ విడిచి వెళుతుండడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొందరు సీనియర్ అధికారులు హైదరాబాద్, ఢిల్లీలో నివాసం ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక కార్యక్రమాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మెమో జారీ చేశారు. సచివాలయానికి సైతం అధికారులు హాజరుకాకపోవడం పట్ల ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాంపు కార్యాలయాల నుంచే విధుల నిర్వహణపై సీఎస్ అసహనం ప్రదర్శించారు.
Andhra Pradesh
Government
IAS
IPS
CS
Neelam Sahni

More Telugu News