కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే: సీపీఎం మధు

government use power to win in localbody pols
షార్ట్స్‌లో చూడండి
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వీర్యం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దొందూదొందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఈరోజు ఆయన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని, విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఏఏ స్థానాలు ఏకగ్రీవం అవుతాయో ఆ స్థానాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించాలన్నారు. దౌర్జన్యాలు జరిగిన చోట ఎన్నికలు నిలిపివేయాని డిమాండ్‌ చేశారు.
Go Back to Shorts
Local Body Polls
CPM
manifesto
YSRCP

More Telugu News